అంతర్ రాష్ట్ర గంజాయి రవాణా నిందితుల అరెస్ట్.

భారత్ న్యూస్ వరంగల్…..రామగుండం పోలీస్ కమిషనరేట్

అంతర్ రాష్ట్ర గంజాయి రవాణా నిందితుల అరెస్ట్

నలుగురు నిందితులను పట్టుకున్న రామగుండం పోలీసులు – 20 కిలోల గంజాయి స్వాధీనం

03 సెల్ ఫోన్ లు స్వాధీనం

పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపెల్లి డిసిపి గోదావరిఖని ఏసీపీ రమేష్ తో కలిసి పత్రిక సమావేశం ఏర్పాటు చేసి అంతర్రాష్ట్ర గంజాయి రవాణా నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు.

ఈ రోజు రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ నగర్ వద్ద రామగుండం ఎస్ ఐ సంధ్య రాణి సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా రామగుండం రైల్వే స్టేషన్ నుండి అనుమానాస్పదంగా బ్యాగులతో కనిపించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోని వారి వివరాలు అడగగా సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా బ్యాగ్ లలోని 20కిలోల డ్రై గంజాయి గుర్తించడం జరిగింది వెంటనే వారిని అదుపులోకి తీసుకోని అనంతరం అతన్ని విచారించగ ఒరిస్సా రైల్వే స్టేషన్ లో గుర్తుతెలియని వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసినాము అని వారి పేర్లు విపిన్ కుమార్, దీపక్, వికాస్ కుమార్, మైనర్ అని తెలిపి వారి వద్ద కూడా గంజాయి ఉన్నదని తెలపగ అందరి వద్ద నుండి 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో అమ్ముతామని తెలపడం జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేయడం జరిగింది అని డీసీపీ తెలిపారు.

  1. మైనర్
  2. విపిన్ కుమార్, తండ్రి: కమలేష్ కుమార్, వయస్సు: 25 సంవత్సరాలు, నివాసం: కరాహి, ఔరయ్య, ఫాఫుండ్, ఉత్తర ప్రదేశ్ –
  3. దీపక్, తండ్రి: మహేంద్ర సింగ్, వయస్సు: 25 సంవత్సరాలు, నివాసం: కరాహి, ఔరయ్య
  4. వికాస్ కుమార్, తండ్రి: కైలాస్, వయస్సు: 20 సంవత్సరాలు, నివాసం: కరాహి, ఔరయ్య, ఫాఫుండ్, ఉత్తర ప్రదేశ్ –

వివరాల్లోకి వెళితే…

ఉత్తర ప్రదేశ్ ని కి చెందిన విపిన్ కుమార్, దీపక్, వికాస్ కుమార్, మైనర్ బాలుడు కూలి పని చేస్తూ వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోక గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణా కు పాల్పడుతున్నారు. ఒరిస్సా రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి దగ్గర వద్ద గంజాయి కొనుగోలు చేసి కేరళ ఎక్స్ప్రెస్ లో ఫరీదాబాద్ కి వెళుతున్న సమయం లో రైల్వే పోలీస్ వారు ట్రైన్ లో తనిఖీ లు నిర్వహిస్తున్నారని దొరికిపోతామని భయంతో రామగుండం రైల్వేస్టేషన్లో దిగి అక్బర్ నగర్ బోర్డు ప్రాంతం లో తిరుగుతుండగా అదే సమయంలో రామగుండం ఎస్ఐ సంధ్యారాణి అక్బర్ నగర్ బోర్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానస్పదంగా నలుగురు వ్యక్తులు బ్యాగులతో కనిపించడంతో వారిని ఆపి వివరాలు అడగగా సరైన సమాధానం చెప్పకపోవడంతో వారిని తనిఖీలు చేయగా వారి బ్యాగులలో గంజాయి ప్యాకెట్లు లభించడం జరిగింది. వెంటనే వారిని అదుపులకు తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించి విచారించి కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని డీసీపీ తెలిపారు.

డీసీపీ మాట్లాడుతూ…గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

గంజాయి వినియోగం ఆరోగ్యానికి హానికరమేకాకుండా కుటుంబాల్ని, సమాజాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంటూ, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.