వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ.ఎంపీ డీకే అరుణ పర్యటన లో ఉద్రిక్తత.

భారత్ న్యూస్ ఖమ్మం…..బ్రేకింగ్

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ.

ఎంపీ డీకే అరుణ పర్యటన లో ఉద్రిక్తత.

ఇటీవల అమరచింత మున్సిపాలిటీ లో కేంద్ర ప్రభుత్వం పథకం అమృత్ 2.0 భాగంగా అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.

కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులకు స్థానిక ఎంపీ డీకే అరుణ గారికి కనీస సమాచారం ఇవ్వకపోవడంతో నేడు భూమి పూజ చేసేందుకు వెళ్లిన ఎంపీ డీకే అరుణ.

అడ్డుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ శ్రేణులు.

కాంగ్రెస్,బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట.

ఎంపీ డీకే అరుణ గారిని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయగా నిలువరించిన బీజేపీ శ్రేణులు.

బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం

కాంగ్రెస్ శ్రేణుల నినాదాల మధ్య ఎంపీ డీకే అరుణ భూమి పూజా..

అమర చింత పెద్ద చెరువు సుందరీకరణ పనులకు భూమి పూజ చేసిన ఎంపీ డీకే అరుణ గారు.

వనపర్తి జిల్లా
మక్తల్ నియోజకవర్గం
అమరచింత మున్సిపాలిటీ

పెద్ద చెరువు సుందరీకరణ పనులకు భూమి పూజ చేసిన ఎంపీ డీకే అరుణ.

ఎంపీ డీకే అరుణ

నరేంద్ర మోదీ ప్రభుత్వం అమృత్ 2.0 పథకం లో భాగంగా పెద్ద చెరువు సుందరీకరణ కు ఎంపీ గా నాకు కనీస సమాచారం ఇవ్వలేదు..

బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి..

హుందా తనం వదిలేసి..అహంకారం ప్రదర్శిస్తున్నారు.

మక్తల్ పట్టణంలో టూరిజం శాఖలో సుందరీకరణ పనులకు కూడా కేంద్రం నిధులు ఇచ్చిన శంకుస్థాపనల కు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు.

రాష్ట్రంలోనీ ప్రతి పని కేంద్రంలోని ప్రతి పథకం నిధులు ఉన్నాయి.

ప్రోటోకాల్ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.

నేను ఎమ్మెల్యేగా,మంత్రిగా,ఎంపిగా రాజకీయాల్లో ఉన్న..

బాధ్యతలు, గౌరవం, ప్రోటోకాల్ అన్ని తెలుసు.

అందరిని కలుపుకొని వెళ్తున్నాం.

కేంద్ర ప్రభుత్వం నిధుల గురించి చెప్పకుండా.. తప్పుడు ప్రచారం ఎమ్మెల్యేలు చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇండ్లలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి.

నిజమైన పేదలకు కాకుండా.. కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు.

ఎమ్మెల్యేల,మంత్రుల,ముఖ్యమంత్రి ఇండ్ల నుంచి నిధులు ఇవ్వడం లేదు.

ప్రజలు చెల్లించిన పన్నులతో చేసే ప్రతి పనికి ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం అందించాలి.

చెరువుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి.

కేంద్రం నిధులు ఉన్న ప్రతి పథకం, పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీకి ఆహ్వానం ఉండాలి.

కొందరు గూండాలను నిండా మద్యం తాగించి.. అడ్డుకునే ప్రయత్నం చేయించారు.

మక్తల్ నియోజకవర్గంలో కొత్త సంప్రదాయం తీసుకువస్తున్నారు.

మంత్రి శ్రీహరి కొత్త ప్రాక్టీస్ మొదలు పెట్టారు. మా పైన దాడి చేసే సంప్రదాయం మంచిది కాదు.. ఇది మీ మంత్రి పదవికి శోభను ఇవ్వదు.

మహిళా ప్రజా ప్రతినిధిని గౌరవించడం నేర్చుకో.. పార్లమెంట్ సభ్యురాలుని అని గుర్తు పెట్టుకోండి.

ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న ఎంపీగా ప్రజలు అరుణమ్మను గెలిపించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులు అంటూ.. తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు.

రాయలసీమ గుండాలకే నేను భయపడలేదు.. ఇటువంటి గూండాలను నేను చాలా మందిని చూశాను..

ఇలాంటి ప్రయత్నలతో భయపడుతామని భ్రమలు పడకండి.

అభివృద్ధి కోసం కలసి రండి.. తప్ప తప్పుడు సంప్రదాయం మానుకోండి…