సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సైబరాబాద్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో నటి రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్య చేసిన విశాఖపట్నం వ్యక్తిని అరెస్ట్ చేశారు. నకిలీ ఖాతా ద్వారా ఈ వ్యాఖ్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

.భారత్ న్యూస్ హైదరాబాద్….సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సైబరాబాద్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో నటి రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్య చేసిన విశాఖపట్నం వ్యక్తిని అరెస్ట్ చేశారు. నకిలీ ఖాతా ద్వారా ఈ వ్యాఖ్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

సాంకేతిక దర్యాప్తుతో నిందితుడిని గుర్తించి గచ్చిబౌలి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అతను ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

సోషల్ మీడియా వినియోగదారులు బాధ్యతగా ప్రవర్తించాలని, అభ్యంతరకర పోస్టులు చట్టపరమైన చర్యలకు దారితీస్తాయని పోలీసులు హెచ్చరించారు. సైబర్ నేరాలను 1930 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.