పోటెత్తిన ఓటర్లు.. అస్సాం, పుదుచ్చేరిలో రికార్డ్‌ స్థాయి పోలింగ్‌*

భారత్ న్యూస్ అనంతపురం..పోటెత్తిన ఓటర్లు.. అస్సాం, పుదుచ్చేరిలో రికార్డ్‌ స్థాయి పోలింగ్‌*

అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. అస్సాం, పుదుచ్చేరిలో రికార్డ్‌స్థాయి ఓటింగ్‌ నమోదుకాగా, కేరళలో గత ఎన్నికల కంటే ఎక్కువగా ఓటింగ్‌ నమోదైంది. ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన తుది గణాంకాల ప్రకారం, అస్సాంలో 84.42 శాతం, కేరళలో 78.12 శాతం, పుదుచ్చేరిలో 89.87 శాతం ఓటింగ్‌ నమోదైంది.