భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రపంచ చరిత్రలో భారత్ సంచలనం: 193 దేశాలు చేయలేని అద్భుతం.. తమిళనాడు గడ్డపై అణుశక్తి విశ్వరూపం!* కల్పాక్కం: ఏప్రిల్ 6, రాత్రి 8:30 గంటలు.. ప్రపంచ అణు విజ్ఞాన చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడిన సమయం ఇది. అగ్రరాజ్యాలైన అమెరికా, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలు వేల కోట్ల డాలర్లు ఖర్చు చేసి, సాధ్యం కాదని చేతులెత్తేసిన ఒక అసాధారణ విజయాన్ని భారత్ సాధించి చూపింది.తమిళనాడులోని కల్పాక్కంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ‘ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ (PFBR) విజయవంతంగా ‘క్రిటికాలిటీ’ని సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంపై ప్రధాని మోదీ స్వయంగా రాత్రి 9:41 గంటలకు ప్రపంచానికి సమాచారాన్ని అందించారు.
ఏమిటీ విజయం? భారత్ సాధించింది ఏంటి?
భారత అణు పితామహుడు డాక్టర్ హోమీ బాభా కన్న కల నేడు నిజమైంది. మన దేశ అణు ఇంధన కార్యక్రమాల్లో ‘రెండవ దశ’ (Second Stage) లోకి భారత్ అధికారికంగా అడుగుపెట్టింది. రష్యా తర్వాత ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే రెండో దేశంగా భారత్ అవతరించింది.
దీని ప్రత్యేకత ఏంటి? సాధారణ అణు రియాక్టర్లు ఇంధనాన్ని వినియోగించుకుంటాయి. కానీ, ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది విద్యుత్‌ను తయారు చేయడానికి ఎంత ఇంధనాన్ని వాడుకుంటుందో, అంతకంటే ఎక్కువ ఇంధనాన్ని (Pu-239) తిరిగి ఉత్పత్తి చేస్తుంది. అందుకే దీనిని ‘బ్రీడర్’ (ఉత్పత్తి చేసేది) అని పిలుస్తారు.
థోరియం నిక్షేపాలతో 400 ఏళ్ల వెలుగులు!
భారతదేశం వద్ద ఉన్న అతిపెద్ద ఆయుధం మన సముద్ర తీరాల్లోని ఇసుకలో దొరికే ‘థోరియం’. ప్రపంచ థోరియం నిక్షేపాల్లో దాదాపు 25 శాతం మన దగ్గరే ఉంది. అయితే, థోరియంను నేరుగా విద్యుత్ తయారీకి వాడలేము. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల సాయంతో థోరియంను అణు ఇంధనంగా మార్చుకోవచ్చు.
అద్భుత గణాంకాలు: సాధారణంగా భారత్‌లో ఒక రోజు విద్యుత్ అవసరాల కోసం సుమారు 20 నుండి 30 లక్షల టన్నుల బొగ్గు అవసరమవుతుంది. కానీ, అదే స్థాయి విద్యుత్తును కేవలం 3 నుండి 4 టన్నుల థోరియంతో ఉత్పత్తి చేయవచ్చు!
ఇంధన స్వయం సమృద్ధి: ఈ టెక్నాలజీతో భారత్ రాబోయే 400 ఏళ్ల వరకు విద్యుత్ అవసరాలను తన సొంత ఇంధనంతోనే తీర్చుకోవడమే కాకుండా, ఏటా 300కు పైగా అణు ఆయుధాలను తయారు చేసుకోగల సామర్థ్యాన్ని పొందుతుంది.
అగ్రరాజ్యాలకు సాధ్యం కానిది.. మనకేలా సాధ్యమైంది?
అమెరికా, జపాన్ వంటి దేశాలు ఈ టెక్నాలజీ కోసం 50 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసి, చివరకు సాంకేతిక సవాళ్లను ఎదుర్కోలేక ‘ఇది అసాధ్యం’ అని వదిలేశాయి. కానీ, భారతీయ శాస్త్రవేత్తలు పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడి, అతి తక్కువ ఖర్చుతో స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రియాక్టర్‌ను నిర్మించి విజయవంతంగా రన్ చేశారు.
భారత్ ప్లస్ పాయింట్స్:
యూరేనియం అవసరం లేదు: ఇకపై యూరేనియం కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పనిలేదు. మన మట్టిలోనే ఉన్న థోరియంను ఇంధనంగా మార్చుకోవచ్చు.
ఆర్థిక లాభం: ఏటా చమురు, యూరేనియం దిగుమతుల కోసం ఖర్చు చేసే వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి.
పర్యావరణ హితం: బొగ్గు వాడకం తగ్గి, కర్బన ఉద్గారాలు లేని స్వచ్ఛమైన అణు విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.

తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో పుష్కలంగా లభించే థోరియం నిక్షేపాలతో భారత్ ‘గ్లోబల్ ఎనర్జీ సూపర్ పవర్’గా ఎదిగేందుకు ఈ విజయం పునాది వేసింది. భారత శాస్త్రవేత్తల మేధస్సుకి, ప్రధాని మోదీ దార్శనికతకు దక్కిన ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఘట్టం!