భారత్ న్యూస్ ఖమ్మం…..జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం
జగిత్యాల:
జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా పార్టీ మార్పుల అంశంపై మంత్రి స్పందించారు.
జీవన్ రెడ్డి పార్టీ మారడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకోవడం లేదని, జీవన్ రెడ్డే మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
పదేళ్ల పాటు కెసిఆర్‌ను విమర్శించిన జీవన్ రెడ్డి, ఇప్పుడు అదే పార్టీలో చేరడం సరైంది కాదని విమర్శించారు.
జీవన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఓటమి అనంతరం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి “అన్నా బాధపడకు” అంటూ భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు.
జీవన్ రెడ్డి పార్టీ మారొద్దని మహేష్ గౌడ్, శ్రీధర్ బాబు సూచించినట్లు తెలిపారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని మంత్రి పేర్కొన్నారు….