వరంగల్ జిల్లాలో హృదయవిదారక ఘటన

భారత్ న్యూస్ వరంగల్….. …..వరంగల్ జిల్లాలో హృదయవిదారక ఘటన

గంజాయి మత్తులో స్నేహితురాలిని గ్యాంగ్ రేప్ చేసి, ఉరి వేసి చంపేసిన యువకులు

వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని ఏకే తండాకు చెందిన యువతిని(21), రావూరు తండాకు చెందిన నలుగురు యువకులు, నిన్న రాత్రి గ్యాంగ్ రేప్ చేసిన ఉరి వేసి చంపేశారని ఆరోపిస్తున్న యువతి కుటుంబ సభ్యులు

స్నేహితులే కదా అని మాట్లాడితే, ఆమెను మొక్క జొన్న చేనులోకి తీసుకెళ్లి, రేప్ చేసి, ఇంటికి తీసుకొచ్చి, చీరతో ఫ్యాను కొండికి ఉరివేసి చంపేశారని రోదిస్తున్న యువతి తల్లి

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మార్చూరి ముందు జాతీయ రహదారిపై యువతి కుటుంబ సభ్యుల నిరసన

యువతి కాల్ డేటా ప్రకారం నిందితులను అరెస్టు చేయమంటే, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు

నిందితుల ఎప్పుడూ గంజాయి మత్తులో ఉండేవారని ఆరోపణలు

బాధ్యులను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేసే వరకు మృతదేహానికి పోస్ట్ మార్టం చేయనివ్వం అని తెగేసి చెప్తున్న యువతి కుటుంబ సభ్యులు