లులు’మాల్ కు భూ కేటాయింపు.. వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్

భారత్ న్యూస్ విజయవాడ…లులు’మాల్ కు భూ కేటాయింపు.. వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్

విజయవాడ :

ఏపీలోని విజయవాడలో లూలు మాల్కు భూముల కేటాయింపుపై చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలో లూలు మాల్కు భూమి కేటాయింపు సవాలు చేస్తూ దాఖలైన పిల్పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. లులు మాల్కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.