…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్లో అక్రమ మోటార్లు స్వాధీనం
హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో తక్కువ నీటి ప్రెజర్పై వచ్చిన ఫిర్యాదులపై 7 అక్రమ మోటార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పైపులైన్లకు మోటార్లు బిగించడం వల్ల ఇతరులకు నీటి సరఫరా ప్రభావితం అవుతుందని తెలిపారు.

ఇలాంటి చర్యలకు పాల్పడితే ₹5,000 జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమస్యలు ఉంటే అధికారికంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.