రూ. 2 కోట్ల హవాలా నగదు సీజ్.

భారత్ న్యూస్ విజయవాడ…రూ. 2 కోట్ల హవాలా నగదు సీజ్

AP: విజయవాడలోని గుణదల ప్రాంతంలో భారీస్థాయిలో హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్లకు పైగా నగదును తనిఖీల్లో పట్టుకున్నారు. అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి సోదా చేయగా ఈ అక్రమ డబ్బు వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నగదును IT శాఖాధికారులకు అప్పగించారు.

పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది