భారత్ న్యూస్ వరంగల్….. ..TGCET 2026 ఫేజ్-1 ఫలితాలు విడుదల
Apr 07, 2026,
TGCET 2026 ఫేజ్-1 ఫలితాలు
తెలంగాణ : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన TGCET 2026 ఫేజ్-1 ఫలితాలను సంక్షేమశాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మంగళవారం విడుదల చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి VI నుంచి IX తరగతుల వరకు బ్యాక్లాగ్ ఖాళీలతో పాటు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిగి, ఖమ్మంలో VIII తరగతి ప్రవేశాలకు ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఫేజ్-1లో 6,242 సీట్లు భర్తీ చేశారు. ఎంపికైన విద్యార్థులు ఏప్రిల్ 7 నుండి 20 వరకు ధృవపత్రాలతో హాజరుకావాలి.
