భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా, మచిలీపట్నం :
రాజకీయాల కోసం జీవితం ఇచ్చిన తల్లిదండ్రుల జీవితాలను నడి రోడ్డున పెట్టిన వ్యక్తి పేర్ని నాని..
మీడియా సమావేశంలో మచిలీపట్నం జనసేన ఫైర్ బ్రాండ్ కొరియర్ శ్రీను
బందరు పెద్ద ముత్తైదవు పేర్ని నాని అంటూ ఆగ్రహం
తన గాధనే కాకుండా తన తండ్రి గాధను రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా పేర్ని నాని చెప్పాడు..
ఎవ్వరికీ తెలియని పేర్ని కృష్ణమూర్తి చరిత్రను పుంకాలు పుంకాలుగా బయటపెట్టారు..
తండ్రి మీద ప్రేమతో చెప్పారా..? లేక తండ్రి మీద ఉన్న ద్వేషంతో పెట్టారో నాకైతే తెలియదు
మా అధినేత పవన్ కళ్యాణ్ తల్లి మీద, భార్య మీద పేర్ని నాని ఎన్నో వ్యక్తిగత విమర్శలు చేశాడు
కానీ ఏ నాడైనా మేము మీ తల్లిదండ్రుల గురించి గానీ, మీ కుటుంబం మీద గానీ వ్యక్తిగత విమర్శలు చేయలేదు..
అది మా సంస్కారం…
1992లో మీ తండ్రి కృష్ణమూర్తి గారు విక్టోరియా గారి సమక్షంలో నిన్ను తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తే.. 1995లో ఆయనే ఎందుకు తిరిగి పోటీ చేశారు..?
పేర్ని కృష్ణమూర్తి గారిని మీ నాన్న గారు ఏ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారో పేర్ని నాని గారు చెప్పగలరా..?
హిందూ మ్యారేజ్ చేసుకున్నారా..? క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారా..?
మ్యారేజ్ సర్టిఫికేట్లు పెట్టగలరా..? సాక్షి సంతకాలు ఎవరు పెట్టారు..?
హిందూ మ్యారేజ్ చేసుకుంటే కొనకళ్ల నారాయణరావు గారు సాక్షి సంతకం పెట్టారా..? లేదా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటే కోనేరు రంగారావు గారు సాక్షి సంతకం పెట్టారా..?
వీటికి పేర్ని నాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం…
మీ తండ్రి గారి గురించి మేమం ఎవ్వరం అడగకపోయినా మీ తండ్రి మీద కోపంతో మీరే ప్రెస్ మీట్ పెట్టి మీ తండ్రి గారి పరువును రోడ్డు మీదకు దిగజార్చారు
ప్రెస్ మీట్ లో నవరసాలు, హావభావాలతో పాత సినిమాల్లోని రేలంగిలా మీరు మాట్లాడారు
2024లో మీరు రాజకీయ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు మీ కొడుకుని రాజకీయ వారసుడిగా ప్రకటించారు…
మరి ఆ నాడు మీ నాన్న గారు మిమ్మల్ని ఎందుకు బహిరంగంగా రాజకీయ వారసుడు అని ఎందుకు ప్రకటించారు..
ఒకవేళ మిమ్మల్ని రాజకీయ వారసుడిగా ప్రకటించి ఉంటే ఆ నాడు మీ నాన్న గారితో ఉన్న 24 మంది మీ నాన్న గారిని కాదని ఎందుకు MLA సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు..
ఎందుకంటే ఎమ్మెల్యేగా నువ్వు సరికాదని పేర్ని కృష్ణమూర్తి భావించి తిరిగి పోటీ చేశారు
నువ్వు ఒక గజ దొంగవి అని కొన్ని వందల మందికి మీ నాన్న గారు చెప్పేవాళ్లు..
నీకు భయపడి మీ నాన్న గారు విక్టోరియా గారి ఇంట్లో ఉండే నామినేషన్ వేశాడు..
దీంతో మీరు మీ నాన్న గారి మీద ద్వేషం పెంచుకున్నావ్..
అందుకే 1995 మున్సిపల్ ఎన్నికల్లో మీ నాన్న గారు 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పెదసింగు లక్ష్మణరావు గారి అబ్బాయిని కౌన్సిలర్ గా నిలబెట్టారు..
ఆయన్ని ఓడించడం కోసం, మీ నాన్న గారి రాజకీయ జీవితాన్ని బదలాం చేయడం కోసం మీ అనుచరుడు బొర్రా విఠల్ ను ఇండిపెండెంట్ గా పోటీలో పెట్టిన మాట వాస్తవం కాదా..?
పేర్ని కృష్ణమూర్తి గారు బ్రతికి ఉన్నంత సేపు చాలా క్షోభకు గురి చేశావ్..
నువ్వు పెట్టిన క్షోభతోనే ఆ పెద్దాయన మున్సిపల్ ఎన్నికల తర్వాత అనారోగ్యం పాలై మంచాన పడ్డారు
ఆ నాడు DC ఛైర్మన్ గా ఉన్న బుద్ధప్రసాద్ గారు మున్సిపల్ ఛైర్మన్ గా గాడెల్లి పరిశుద్ధ బాబు గారిని ప్రకటిస్తే ఆయన గెలిస్తే ఎక్కడ నీ రాజకీయ ఉనికిపోతుందో అని ఆ నాడు మ్యాండెట్లు చింపించి వెన్నుపోటు పొడవలేదా..?
నా తండ్రి కోసం జీవితాన్ని త్యాగం చేశానని చెబుతున్న పేర్ని నాని 25 యేళ్ల రాజకీయ జీవితంలో ఏ నాడైనా నీ బంధువులను తెర మీదకు తీసుకొచ్చావా..?
రేవతి సెంటర్ నుండి కోనేరుసెంటర్ వరకు జరిగిన రోడ్డు విస్తరణలో ఏ ఒక్కరికైనా నోటీసులు ఇచ్చారా..?
అర్థరాత్రి సమయంలో ఓ వైశ్య కుటుంబానికి చెందిన కల్పన టెక్స్ టైల్స్ ను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రొక్లైన్ పడగొట్టిన మాట వాస్తవం కాదా..?
నోటీసులు ఇవ్వలేదని చెప్పండి మేం బందరు వదిలి వెళ్లిపోతాం..
అదే రోజున కల్పన టెక్స్ టైల్స్ ఎదురుగా ఉన్న సుబ్బయ్య గారి హోటల్ జోలుకు ఎందుకు వెళ్లలేదు..?
మీ అనుచరుడు మేకల సుబ్బన్న లక్ష్మీటాకీస్ సెంటర్ లో బార్ పెట్టుకోవడానికి ఎవ్వరూ స్థలం ఇవ్వకపోతే ఆ సెంటకర్ లో బొర్రా నటేష్ గారి సతీమణి పేరిట ఉన్న లక్ష్మీటాకీస్ థియేటర్ పనికి రాదని మున్సిపాల్టీ నుండి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం కాదా…?
బొర్రా నటేష్ సరెండర్ అయి అక్కడ బార్ కి స్థలం ఇస్తే ఆ నాడు పనికి రాని థియేటర్ నేడు కన్వెన్షన్ హాలుగా ఎలా అయిందో పేర్ని నాని చెప్పాలి
నిన్ను కన్న పాపానికి మీ తల్లిదండ్రులను నడి రోడ్డు మీదకు తీసుకువచ్చావ్..
పేర్ని కృష్ణమూర్తి గారు చనిపోయిన రోజున రిక్షాలో తీసుకువెళ్లింది నువ్వు కాదు మీ ఇంటి వెనుక ఉన్న కాంపౌండర్ నాగబాబు
ఆస్పత్రిలో మీ తండ్రి గారికి అన్ని రకాల సేవలు చేసింది కూడా నాగబాబే…
అందరూ తిడితే చివరి రోజుల్లో ఆస్పత్రికి వెళ్లావ్..?
పేర్ని కృష్ణమూర్తి గారి అనవాళ్లు కూడా ఉండకూడదనే కార్మిక భవనం అనే పేరుతో ఉండే మీ తండ్రి గారి భవనాన్ని పడేసి అమ్మేశావ్…
మీ తండ్రి మీద అంత ప్రేమ ఉంటే ఆ భవనాన్ని జ్ఞాపకంగా, మ్యూజియంగా ఎందుకు చేయలేదు
15యేళ్లు MLAగా పని చేసిన నువ్వు మీ తండ్రి జ్ఞాపకార్ధం బందరులో ఒక్క విగ్రహమైనా పెట్టావా..?
నవరసాలు పండించి మాట్లాడితే నమ్మడానికి బందరు ప్రజలు పిచ్చోళ్లు కాదు
నా కొడుకు నా మాట వినడం లేదు అని నువ్వే ఒప్పుకున్నప్పుడు బలవంతంగా బందరు ప్రజలపై ఎందుకు రుద్దుతున్నావ్..
ఎందుకంటే నీ అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికే…ఒక పది రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తన అనుచరులకు ఇష్టం వచ్చినట్టు బార్ లు ఇష్టారీతిన ఇచ్చేస్తున్నారని మీరు ఆరోపించారు..
అయ్యా పేర్నినాని గారు మేం టెండర్లలో పాల్గొంటే మాకు బార్ వచ్చాయి..
లైసెన్స్ ప్రొవిజన్ లైసెన్స్ అంటే మంత్రిగా పని చేసిన మీకు తెలుసా…?
మీ అనుచరుడు లింగం ఆనంద్ తో నా బార్ మీద హైకోర్టులో రిట్ వేయించలేదా..?
రిట్ వేయటంతో మా మంత్రి గారు మా బార్ ని క్లోజ్ చేయించారు
మొన్న శనివారం హైకోర్టు రిట్ వేసిన లింగం ఆనంద్ ని తిట్టి నా బార్ ను తిరిగి కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు
కొబ్బరితోటలో జనసేన కార్యకర్త ఇంటిని అధికారులు అక్రమంగా పడగొడితే మేం కాపాడామని రాజకీయం చేశావ్..
ఆ నాడు నీ అనుచరులు అక్రమంగా వేసిన లే అవుట్ లో స్థలం కొనుగోలు చేసి మా జనసైనికుడు మోసపోయాడు..
మీ నిర్వాకం వల్ల నా ఇళ్లు పడగొట్టేశారని బాధితుడు నీకు చెప్పుకుంటే అక్కడకు వచ్చి రాజకీయం చేస్తారా..?
నీ అనుచరులను కాపాడుకోవడం కోసం అక్కడకు వచ్చి చిందులు వేశారు
నేను అడిగే ప్రతి ప్రశ్నకు పేర్ని నాని సమాధానం చెప్పాలి..?
దీనిపై కోనేరుసెంటర్ లో బహిరంగ చర్చకు కూడా నేను సిద్ధం

నా ఆరోపణలను నిరూపిస్తే జనసేన పార్టీ నీకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది
లేదంటే నువ్వు, నీ కొడుకు బందరు వదిలి వెళ్లిపోతావా…?