భారత్ న్యూస్ శ్రీకాకుళం….వారం వ్యవధిలో ఇరువురు సిఐ ల పై వేటు,
దారి తప్పుతున్న సిఐ లపై ఉన్నతాధికారుల చర్యలు పట్ల ప్రజలు హర్షం.
పల్నాడు:- జిల్లా లో పలువురు పోలిస్ సిబ్బంది పనితీరు పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వారం రోజుల్లో ఇరువురు సిఐ లపై బదిలీ వేటు పడింది.
పల్నాడు లోని దాచేపల్లి సిఐ గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ ను వారం క్రితం ఉన్నతాధికారులు విఆర్ కు బదిలీ చేసారు. మాచర్ల లో విధులు నిర్వహిస్తున్న వెంకట రమణ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మహిళతో వివాహేతర సంబంధం ఆరోపణలతో ఒక సిఐ పై బదిలీ వేటు పడగా, పరువు హత్య కేసులో నిర్లక్ష్యంతో పాటు నగదు వసూళ్ల చేసినట్లు ఆరోపణలతో మరో సిఐ సస్పెండ్ అయ్యారు.

శాఖ పరువు పోయే విధంగా విధి నిర్వహణ చేస్తున్న సిఐ లపై ఉన్నతాధికారులు బదిలీ, సస్పెండ్ వేటు నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.