భారత్ న్యూస్ ఖమ్మం…..జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ మేళా ఈ నెల 7వ తేదీన ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఎం ఏ ఎల్ డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గద్వాల్ నందు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా వివిధ కంపెనీలలో సుమారు 500 ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ జాబ్ మేళాలో TVS,SL LUMAX,SLAP,HYUNDAI GLOVIS,TATA ELECTRONICS, TAFE,FINE TOOLS,DSC-DAE CHANGE SEAT CO., SUNGWOO HITECH, MOTHER SON,DUNG JIN,POS-HYUNDAI సంస్థలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువత మరియు 10వ తరగతి,ఇంటర్,డిగ్రీ, ఐటీఐ, విద్యార్హతలు కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్ కార్డు నమోదు చేసుకొని జాబ్ మేళాలో హాజరుకావాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి కోరారు.
ఇతర వివరాల కోసం 9985764544 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.