విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు.

భారత్ న్యూస్ గుంటూరు…విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ నాయకునిగా నిరూపించుకున్నారని ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు కొనియాడారు.

ఉభయ సభలు లోక్ సభ, రాజ్యసభలలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా అవనిగడ్డలోని ఒకటవ వార్డులో గల విక్కుర్తి కార్యాలయంలో గురువారం సాయంత్రం విక్కుర్తి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గురువారం సాయంత్రం శ్రీనివాస్ తన గృహంలో దీపాలు వెలిగించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు ఉభయ సభలలో ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకొని సంతోషం వెలిబుచ్చారు.

ఈ సందర్భంగా విక్కుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, విజనరీ నాయకునిగా ముందుచూపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిగా అమరావతి బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని రెండు ఉభయసభలలో అమరావతి బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని నినాదంతో అమరావతిని దేశంలోనే అత్యున్నత రాజధానిగా రూపుదిద్దుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు విక్కుర్తి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.