జనసేన పార్టీ కార్యాలయం వద్ద దీపాలు వెలిగించి ఆనంద ఉత్సాహం

భారత్ న్యూస్ రాజమండ్రి…జనసేన పార్టీ కార్యాలయం వద్ద దీపాలు వెలిగించి ఆనంద ఉత్సాహం

అమరావతి రాజధానికి చట్టభద్రత కల్పిస్తూ బుధవారం నాడు లోకసభలో, గురువారం నాడు రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు ఆమోదించడంపై జనసేన పార్టీ కార్యాలయాల వద్ద రంగవల్లులు వేసి దీపాలు వెలిగించి పండగ వాతావరణం లో సంబరాలు నిర్వహించాలని జనసేన కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు కోడూరు మండల జనసేన పార్టీ కార్యాలయం వద్ద ‘ జై అమరావతి’ అంటూ రంగవల్లులను అందంగా తీర్చిదిద్ది దీపాలు వెలిగించి జనసేన పార్టీ నాయకులు ఆనందాన్ని వ్యక్తపరిచారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పార్టీ నేతలు మాట్లాడారు.

మొదటినుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఒకే ఒక రాజధాని ఉంటుందని, అదే అమరావతి అని ఆనాడే ఆయన మాట ఇచ్చారని ఈ సందర్భంగా పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా కార్యాలయం వద్ద భారీ గా టపాసులు పేల్చి మిఠాయి పంచారు.

మండల జనసేన పార్టీ అధ్యక్షులు మరే గంగయ్య, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, కోడూరు పట్టణ అధ్యక్షులు కోట రాంబాబు, కోడూరు పిఎసిఎస్ చైర్పర్సన్ పూత బోయనకరుణ్ కుమార్ ,బడే భవనారాయణ , పూత బోయిన సీతారత్న సాయిబాబు, కాగిత రామారావు, అప్పికట్ల వినోద్ ,మల్ల వెంకటేశ్వరరావు, జరుగు పోతురాజు, కొల్లి వెంకటేశ్వరరావు, బాసు శివప్రసాద్, కడవకొల్లు రంగా, జరుగు సురేష్,తుంగల నారాయణ, ,జరుగు కిరణ్ తో పాటు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.