ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేదు.వైఎస్ షర్మిలా రెడ్డి

భారత్ న్యూస్ గుంటూరు…విజయవాడ

వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నాం.

ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేదు.

మోడీ గారి మెప్పు సభలకు ఖజానా ఫుల్.. పేదోడి సంజీవనికి నిధులు నిల్.

అమరావతి లక్ష కోట్ల అప్పులకు లోటు లేదు.. ఆరోగ్యానికి ఇవ్వడానికి చిల్లిగవ్వ లేదు.

యోగాంధ్ర అని, GST ఉత్సవ సభలని, ఏడాదిలో ..

ప్రధాని విలాసాల కోసమే 12 వందల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు గారికి,

ఆరోగ్యశ్రీ బకాయిలు 3 వేల కోట్లు ఇవ్వడానికి మనసు లేదు.

ఇదేనా కూటమి ప్రభుత్వ మెరుగైన ప్రజారోగ్యం ? ఇలాగేనా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ?

వైద్యం అందక ప్రజలను పాడె ఎక్కించడమా స్వర్ణాంధ్ర 2047 విజన్ ?

ఆరోగ్యశ్రీ పథకం దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR గారి మానస పుత్రిక.

కోట్ల మంది ప్రజలకు ప్రాణాలను నిలిపిన ప్రాణదాత.

సంజీవని లాంటి పథకాన్ని నేడు భ్రష్టు పట్టించారు.

బకాయిలు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ ఉసురు తీస్తున్నారు.

కూటమి ప్రభుత్వ రెండేళ్లలో రెండు సార్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలవడం నిజంగా సిగ్గుచేటు.

నెలల తరబడి వైద్యసేవలు ఆపడం చంద్రబాబు గారి పాలన వైఫల్యానికి నిదర్శనం.

బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపాలని చూసే కుట్ర.

ఆరోగ్యశ్రీ ని అనారోగ్యశ్రీ గా మార్చే ప్రయత్నం.

యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ముసుగులో పథకాన్ని ప్రైవేటుపరం చేసే ఎత్తుగడ.

కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అల్టిమేటం జారీ చేస్తున్నాం.

ప్రజారోగ్యంపై దోబుచులాడటం పక్కన పెట్టి వెంటనే 3 వేల కోట్ల బకాయిలు విడుదల చేయండి.

NTR వైద్య సేవకోసం బడ్జెట్ లో 4 వేల కోట్లు పెట్టిన ప్రభుత్వం..

నిధులు విడుదలకు అభ్యంతరం ఏంటి ?

తక్షణం ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవండి.

వెంటనే వైద్యసేవలను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టండి.