భారత్ న్యూస్ వరంగల్…IT రిటర్న్స్ దాఖలు చేసేవారి రేషన్ కార్డులు రద్దు!
తెలంగాణ :
తెలంగాణలోని రేషన్ కార్డు దారుల్లో కొత్త భయం పట్టుకుంది. IT రిటర్న్స్ దాఖలు చేసేవారి కార్డు రద్దవుతుందనే ప్రచారం ఆందోళన కలిగిస్తోంది.
IT రిటర్న్స్ దాఖలు చేసిన వారిపై GPOలు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు.
వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారు. చాలామంది ఆదాయంతో సంబంధం లేకుండా పర్సనల్, హోమ్ లోన్ల కోసం, ఏదైనా పరిహారం పొందడం, ఆస్తుల అమ్మకం వంటి విషయాల్లో ITR ఫైల్ చేస్తుంటారు.

రేషన్ కార్డు ప్రభుత్వ పథకాలకు ప్రామాణికం కావడంతో తమ కార్డు రద్దవుతుందనే ఆందోళనలో ఉన్నారు. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.