భారత్ న్యూస్ శ్రీకాకుళం….చలపల్లి ఎస్సై దుర్గాంజనేయులు, డ్రైవర్ నాగరాజులను పరామర్శించిన కనపర్తి శ్రీనివాసరావు
మంగళగిరి:చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై దుర్గాంజనేయులు మరియు జీప్ డ్రైవర్ నాగరాజులను బుధవారం టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కనపర్తి మాట్లాడుతూ.. బాధితుల ఆరోగ్య వివరాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఆరా తీశారని వెల్లడించారు. ప్రభుత్వం తరపున క్షతగాత్రులకు అన్ని విధాలా అండగా ఉంటామని, డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు .బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఆయన, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
