నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు

భారత్ న్యూస్ విశాఖపట్నం..నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు

కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావడంతో ఏటీఎం లావాదేవీల నిబంధనలలో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఇకపై యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ కూడా ఉచిత లావాదేవీల పరిమితిలో లెక్కించబడుతుంది.

మెట్రో నగరాల్లో నెలకు 5, ఇతర ప్రాంతాల్లో 3 నుంచి 5 ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి.

పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి రూ.23 వరకు ఛార్జీ విధించబడుతుంది. కొన్ని బ్యాంకులు రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిని కూడా తగ్గించాయి.