నక్సల్స్‌ విముక్త భారత్‌!.. దేశంలో నక్సలిజం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది: అమిత్‌ షా

భారత్ న్యూస్ ఢిల్లీ…..నక్సల్స్‌ విముక్త భారత్‌!.. దేశంలో నక్సలిజం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది: అమిత్‌ షా

దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని, మావోయిస్టు హింసాకాండకు నిలయమైన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం ప్రకటించారు.

దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం విధించిన మార్చి 31వ తేదీ గడువు సమీపిస్తున్న వేళ సోమవారం లోక్‌సభలో అమిత్‌ షా 90 నిమిషాలపాటు నక్సల్‌ విముక్త భారత్‌పై ప్రసంగించారు. బస్తర్‌ ఇప్పుడు అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని, ఈ ఘనత భద్రతా దళాలు, రాష్ట్ర పోలీసులు, స్థానిక గిరిజన సమాజానికే దక్కుతుందని ఆయన తెలిపారు.