భారత్ న్యూస్ హైదరాబాద్….విస్తృతంగా వ్యాపిస్తున్న BA.3.2 కోవిడ్ వేరియంట్ .. 23 దేశాల్లో కేసులు నమోదు
BA.3.2 వేరియంట్‌ను సికాడా వేరియంట్‌గా పిలుస్తున్నారు. అయితే చాపకింద నీరులా ఆ వైరస్ వేరియంట్ వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారీ సంఖ్యలో ఆ వేరియంట్ మ్యుటేషన్లకు గురవుతున్నది.
2024లో తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించారు. జన్యుపరంగా BA.3.2 వేరియంట్‌ను భిన్నంగా అంచనా వేస్తున్నారు. స్పైక్ ప్రోటీన్‌లో సుమారు 75 మ్యుటేషన్లు ఉన్నట్లు గుర్తించారు. మానవ కణాలను చుట్టుకునే వైరస్‌లోని భాగమే స్పైక్ ప్రోటీన్. JN.1 , LP.8.1 వేరియంట్లలో స్పైక్ ప్రోటీన్‌లో కేవలం 40 మ్యుటేషన్లు మాత్రమే జరుగుతున్నట్లు సీడీసీ వెల్లడించింది. BA.3.2 వేరియంట్ సోకిన వారిలో సాధారణ కోవిడ్ లక్షణాలే ఉండనున్నాయి. గొంతు నొప్పి, దగ్గు, తెమడ, నీరసం, తలనొప్పి, జ్వరం లాంటి లక్షణాలు ఉంటాయి.కొందరిలో ఉదర సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని సీడీసీ చెప్పింది.
