చల్లపల్లి పోలీస్ స్టేషన్ పేలుడు ఘటన దురదృష్టకరం క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్

భారత్ న్యూస్ గుంటూరు…చల్లపల్లి పోలీస్ స్టేషన్ పేలుడు ఘటన దురదృష్టకరం క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్

మంగళగిరి/చల్లపల్లి : కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యలు వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మంగళగిరిలోని ఎన్.ఆర్.ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు పోలీసు సిబ్బందిని మంత్రి ఈరోజు స్వయంగా పరామర్శించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తో కలిసి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు,బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అడిషనల్ ఎస్పీ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు,డీన్ డాక్టర్ లక్ష్మీ మంత్రితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి మరియు అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు,దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి బసవేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.