భారత్ న్యూస్ ఢిల్లీ…..లాక్డౌన్ విధించం.. టీమిండియాగా పనిచేసి గడ్డు కాలాన్ని అధిగమిద్దాం..!
పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన పరిణామాల దృష్ట్యా దేశంలో లాక్డౌన్ విధించబోతున్నారనే వార్తలను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు.
లాక్డౌన్ విధించాలనే ఆలోచనే తమకు లేదని ప్రధాని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, లెఫ్టినెంట్ గవర్నర్లతో అత్యున్నత స్థాయి వర్చువల్ సమావేశం నిర్వహించిన మోడీ ఎల్పీజీ, పెట్రోల్, ఎరువుల కొరతపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా వ్యాపార స్థిరత్వం, ఇంధన భద్రతపై ఎల్జీ, సీఎంలకు కీలక సూచనలు చేసిన ప్రధాని టీమిండియాగా పనిచేసి ఈ గడ్డు కాలాన్ని అధిగమిద్దామని పిలుపునిచ్చారు.