పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గింపు.. ధరలు తగ్గుతాయా?

భారత్ న్యూస్ అనంతపురం..పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గింపు.. ధరలు తగ్గుతాయా?

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 తగ్గించగా.. డీజిల్‌పై పూర్తిగా (జీరో) రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు పెట్రోల్‌పై లీటర్‌కు రూ.13, డీజిల్‌పై రూ.10 వరకు ఎక్సైజ్ సుంకం కేంద్రం వసూలు చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీని.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ నష్టాన్ని తగ్గించుకోవడానికి వినియోగించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరకపోయినప్పటికీ.. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ఈ నిర్ణయం కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది.