ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పాజిటివ్!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పాజిటివ్!

తెలంగాణ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ పార్టీలో డ్రగ్స్‌తో పట్టుబడినట్లు తెలుస్తోంది. ఏలూరు(AP) MP పుట్టా మహేశ్, రియల్టర్ నిబిద్ శర్మ, మిశ్రా, రితేశ్ రెడ్డి, రమేశ్, శ్రవణ్, విజయ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. డ్రగ్స్ టెస్టులో రోహిత్ రెడ్డి సహా ఆరుగురికి పాజిటివ్, మహేశ్‌కు నెగటివ్ వచ్చిందని తెలిసింది