భారత్ న్యూస్ తిరుపతి…కదులుతున్న రైలులో విన్యాసం.. కట్ చేస్తే!
రీల్స్ కోసం యువత ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు వేగంగా కదులుతున్న రైలులో డోర్ దగ్గర వేలాడుతూ వీడియో తీయించుకున్నాడు. ఆ సమయంలో పట్టాల పక్కనే ఉన్న స్తంభం బలంగా ఢీకొట్టడంతో అతను కిందపడిపోయాడు. ఆ యువకుడెవరో, బతికున్నాడో లేదో తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదపు వీడియో వైరలవుతోంది•.
