భారత్ న్యూస్ రాజమండ్రి…మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు?
Mar 04, 2026,
మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు?
మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నారని, అనంతరం కేంద్రానికి అప్పగించనున్నారని సమాచారం. కరీంనగర్ జిల్లా సారంగపూర్‌కు చెందిన గణపతి దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అడవి పార్టీలన్నీ ఏకమై మావోయిస్టు పార్టీగా ఏర్పడినప్పుడు ఆయన తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కొంతకాలంగా ఆయన నేపాల్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
