గోదావరి పుష్కర ఘాట్‌ల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ రామ్‌రెడ్డి

.భారత్ న్యూస్ అమరావతి..గోదావరి పుష్కర ఘాట్‌ల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ రామ్‌రెడ్డి

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి పెద్దపల్లి జిల్లాలోని గోదావరి పుష్కర ఘాట్‌ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్, గోలివాడ, గోదావరి బ్రిడ్జ్ సమీపంలోని ఘాట్‌లలో భక్తుల రాకపోకలు, భద్రత, బ్యారికేడింగ్, సీసీ కెమెరాలు, లైటింగ్, పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపులపై ఆయన సూచనలు చేశారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ఇబ్బందులు లేకుండా కంట్రోల్ రూమ్, శుభ్రత, అత్యవసర సేవలతో సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో ఏసీపీ రమేష్, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, జీడీకే-2 టౌన్ సీఐ ప్రసాద్ రావు, అంతర్గాం ఎస్ఐ వెంకట్ తదితరులు పాల్గొన్నారు….