…భారత్ న్యూస్ హైదరాబాద్….TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం కొలువుదీరింది. కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఒక అభిమాని ఈ అద్భుత శిల్పాన్ని రూపొందించారు. గులాబీ రంగులో మెరుస్తున్న ఈ కళాఖండం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్రను స్మరిస్తూ రూపొందించిన ఈ సైకత చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
