✈️ప్ర‌ధాని మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు.. గ‌త ప‌దేళ్ల‌లో 762 కోట్ల ఖ‌ర్చు.

భారత్ న్యూస్ ఢిల్లీ…
✈️ప్ర‌ధాని మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు.. గ‌త ప‌దేళ్ల‌లో 762 కోట్ల ఖ‌ర్చు

గత పదేండ్లలో ఆయన చేసిన విదేశీ యాత్రల కారణంగా భారత ప్రభుత్వానికి అయిన ఖర్చు రూ.762 కోట్లు అని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది.

మోదీ విదేశీ యాత్రలకు ఖర్చు పెరగడానికి కారణం ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోవడం, తిరిగిన దేశాల సంఖ్య, ప్రయాణ దూరం, ప్రతినిధుల సంఖ్య ఎక్కువగా ఉండటం అని వివరించింది.

పర్యటన సందర్భంగా ఆయనకయ్యే వసతి, ఆతిథ్య ఖర్చులన్నీ ఆతిథ్య దేశమే భరిస్తుందని, మన ప్రభుత్వం కేవలం భద్రతా ఏర్పాట్లు, అధికార ప్రతినిధులు, మీడియా, ఇతర అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది.మోదీ విదేశాలకు వెళ్లిన ప్రతిసారి ఓ ప్రతినిధి బృందం ఆయన వెంట వెళ్తుంది. వీరి సంఖ్య అవసరాన్ని బట్టి కనిష్ఠంగా 27 నుంచి గరిష్ఠంగా 72 వరకు ఉన్నది. కాగా నిరుడు ఏకబిగిన ఐదు దేశాల్లో పర్యటించిన నేపథ్యంలో మోదీ వెంట 95 మంది ప్రతినిధులు వెళ్లారు.

మోదీకి ముందు దాదాపు పదేండ్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌ కేవలం నాలుగుసార్లు మాత్రమే విదేశీ యాత్రలు చేశారు. ఇందుకు కేవలం రూ.35.04 కోట్లు ఖర్చయింది.