22 భాషల్లో ‘భారత్‌జెన్‌’

భారత్ న్యూస్ తిరుపతి…22 భాషల్లో ‘భారత్‌జెన్‌’

విదేశాలకు చెందిన చాట్‌జీపీటీ, గ్రోక్‌, జెమినీ, డీప్‌సీక్‌, పర్‌ఫ్లెక్సిటీలకు దీటుగా ‘ భారత్‌జెన్‌’ పేరిట ఓ స్వదేశీ ఏఐ చాట్‌బాట్‌ త్వరలో అందుబాటులోకి రానున్నది.

పౌర సేవలు, విద్య, వైద్యం, వాణిజ్య రంగాలకు ఉపయుక్తంగా ఐఐటీ బాంబే ఇంజినీర్లు ఈ చాట్‌బాట్‌ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు.

✴️ఇంగ్లిష్‌, హిందీతో పాటు మరో 20 భారతీయ భాషల్లో చాట్‌బాట్‌ సేవలు అందించనున్నది. హస్తకళలు, చేనేత, సంస్కృతి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఈ చాట్‌బాట్‌ ఓ మిత్రుడిగా సాయపడుతుందని నిర్వాహకులు తెలిపారు.