బడ్జెట్ పేరుతో మరోసారి మసిపూసి మారేడు కాయ చేశారు.

భారత్ న్యూస్ రాజమండ్రి…విజయవాడ

వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…బడ్జెట్ పేరుతో మరోసారి మసిపూసి మారేడు కాయ చేశారు.

2026-27 రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా సామెతను తలపించింది.

అంతా ఊహ జనితం.. అభూత కల్పనలు.

అంకెలు ఘనం.. అప్పుల కుప్ప.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బారెడుంటే, బడ్జెట్ లో కేటాయింపులు మూరెడంత లేవు.

ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించి, సూపర్ సిక్స్ హామీలకు పంగనామాలు పెట్టారు.

ఇతర ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టారు.

ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వమని మరోసారి నిరూపితం చేసుకున్నారు.

బడ్జెట్ లో ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు.

కూటమి గెలిచి రెండేళ్లు అవుతున్నా మహాశక్తి పథకం అసలుందో లేదో తెలియదు.

నెలకు 15 వందలు ఇస్తామని నమ్మించి కోటిన్నర మంది మహిళలను రెండేళ్లుగా చంద్రబాబు గారు మోసం చేశారు.

రూ.10 లక్షల వరకు ఉచిత రుణాలు అని చెప్పి సున్నావడ్డి పథకానికి ఒక్క రూపాయి కేటాయించలేదు.

నిరుద్యోగులకు మళ్లీ టోకరా పెట్టారు. బడ్జెట్ లో నిరుద్యోగ భృతి పథకం ఊసే లేదు.

నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ..

50 లక్షల మంది నిరుద్యోగులను మళ్లీ మోసం చేశారు.

జనవరి నెలలో ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ గురించి కూడా చెప్పనేలేదు.

ఫీజు రీయింబర్స్ పథకానికి చిల్లిగవ్వ ఇవ్వలేదు.

50 ఏళ్లకే పెన్షన్ హామీకి దిక్కులేదు.

ప్రభుత్వ ఉద్యోగులను సైతం వంచించారు.

వారికి ఇచ్చిన హామీలపై అసలు బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం దారుణం.

అన్నదాత సుఖీభవ పథకానికి మళ్లీ పాత కేటాయింపులు 6,600 కోట్లు మాత్రమే చేశారు.

రాష్ట్రంలో 80 లక్షల మంది లబ్ధిదారులుంటే సుమారు 30 లక్షల మంది రైతులను పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయం.

11 వేల కోట్లు నిధులు ఇవ్వాల్సిన చోట సుఖీభవకి జరిపిన కేటాయింపులు సగం మాత్రమే.

తల్లికి వందనం కింద ఈ సారి కూడా 20 లక్షల మంది బిడ్డలకు అన్యాయం చేశారు.

రూ. 12600 కోట్లు కేటాయించాల్సిన పథకానికి ఈ ఏడాది సైతం 9 వేల కోట్లు మాత్రమే కేటాయించారు.

దీపం 2 పథకానికి రూ 4500 కోట్లు అవసరం ఉన్న చోట కేవలం 2600 కోట్లు కేటాయించారు.

గతేడాదిలా అమలు చేసే సూపర్ సిక్స్ లోని కొన్ని పథకాలను చేసిన కేటాయింపులు సగం సగం మాత్రమే.

మోడీ గారు తెచ్చిన అక్రమ చట్టం VB G- RAM G పై గొప్పలకు పోయి తిప్పలు పడ్డట్లుంది చంద్రబాబు గారి తీరు.

గ్రామ్ జి పథకానికి 8 కోట్లు కేటాయించారు సరే..

మరి రాష్ట్ర వాటా 40 శాతం కింద చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ రూ. 3,070 కోట్లు ఎక్కడ నుంచి తెస్తారు ?

అప్పులు 10 లక్షల కోట్లు దాటాయని బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పారు.

పునర్ నిర్మాణం కోసం అవస్థలు పడుతున్నట్లు చెప్తున్నారు.

అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్ అయితే, MGNREGA కింద 10 వేల కోట్ల ప్రాయోజిత కేంద్ర పథకానికి మోడీ గారు తూట్లు పొడిస్తే ఎందుకు మద్దతు ఇచ్చారు ?

రాష్ట్ర వాటా కింద 700 కోట్లు సర్దితే దక్కే ప్రయోజనానికి, ఇప్పుడు రాష్ట్ర ప్రజల నెత్తిన తలకు మించిన భారం ఎందుకు పెట్టారు ?

అప్పులే దిక్కని చెప్తూ, అన్ని రంగాలకు అరకొర కేటాయింపులు చేసి,