భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం
వీడియో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ల విషయంలో జరుగుతున్న అన్యాయంపై మీడియా అకాడమీ చైర్మన్ గారికి మరియు ఐఎంపీఆర్ కమిషన్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది
మిత్రులారా:-
మన వీడియో జర్నలిస్టులకి ACCREDITATION CARDS ఇష్యూ చేసే టైంలో చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు
ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో జర్నలిస్టుల సంఖ్య మరియు వారి పాత్ర ఎక్కువగా ఉంటుంది.
అంత ముఖ్యమైన వీడియో జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం వైపు నుంచి తీరని అన్యాయం జరుగుతుంది.
వీడియో జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ మీడియాకి వెన్నుముక్క వారి లేనిదే ఎలక్ట్రానిక్ మీడియా లేదు,
ఇంతకుముందు వీడియో జర్నలిస్టులకు ACCREDITATION I&PR తరఫున 12 Cards మరియు.. ఢిల్లీకి సంబంధించి రెండు .. మరియు స్పోర్ట్స్ కోట ఒకటి.. కల్చరల్ కు సంబంధించి ఒకటి.. సినిమాకు సంబంధించి ఒకటి.. ఇలా మొత్తం కలిపి 17 cards ఇచ్చేవారు
ఇప్పుడు 9 CARDS మాత్రమే ఇస్తున్నారు .
వెబ్ సైట్ లో ఫ్రీలాన్స్ APPLY చేసే విషయంలో వీడియో జర్నలిస్టు అనే ఆప్షన్ లేకుండా చేశారు ప్రస్తుతం ఫోటోగ్రాఫర్ & కరస్పాండెంట్ అనే ఆప్షన్ ఇస్తున్నారు …
ఈరోజు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారి నీ మరియు I&PR కమిషనర్ ప్రియాంక గారిని కలిసి మనకు జరుగుతున్న అన్యాయంపై వారికి వివరించడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు
గమనిక :-
అక్రెడిషన్ విషయంలో 1, 2 రోజులలో ప్రభుత్వం తరఫునుంచి మనకి స్పష్టమైన హామీ లభించకపోతే I&PR office ముందు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని మిత్రులకు మనవి

తెలంగాణ స్టేట్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్