భారత్ న్యూస్ గుంటూరు…చంద్రయాన్-4 కోసం ల్యాండింగ్ సైట్ గుర్తింపు
🇮🇳 చంద్రయాన్-4 మిషన్ కోసం చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్ సైట్(దిగే ప్రాంతం)ను ఇస్రో గుర్తించింది. ఈ ప్రాజెక్ట్‌ను భారత్ అత్యంత క్లిష్టమైనదిగా భావిస్తున్నది. ‘చంద్రయాన్-4 కోసం మేం 2028ని లక్ష్యంగా చేసుకున్నాం’ అని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
🇮🇳 అయిదు ప్రాంతాలను పరిశీలించిన మీదట మాన్స్ మౌటన్(ఎంఎం) అనే ప్రాంతాన్ని ల్యాండింగ్ కోసం ఖరారు చేసినట్టు ఇస్రో అధికారులు తెలిపారు.
