భారత్ న్యూస్ తిరుపతి.వారంలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు…
తిరుపతికి చెందిన బయ్యాల చాందిని వారం వ్యవధిలోనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఆమె బుధవారం జుడీషియల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరారు. 2 రోజుల క్రితం గ్రూప్-2లో జాబ్ వచ్చింది. తాజాగా శుక్రవారం విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో DSP క్యాడర్ పోస్ట్కు ఎంపికయ్యారు. ఆమె తండ్రి భాస్కర్ TTD రిసెప్షన్-1 డిప్యూటీ EOగా పని చేస్తున్నారు. కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమేనని చాందిని నిరూపించారు….
