తిరుమల లడ్డు విషయం లో వైసీపీ ఆరోపణలు అర్థరహితం.

భారత్ న్యూస్ డిజిటల్ :కడప:

తిరుమల లడ్డు విషయం లో వైసీపీ ఆరోపణలు అర్థరహితం

తిరుమల లడ్డు విషయం లో కల్తీ జరిగింది అని సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన సిట్ స్పష్టంగా పేర్కొన్న వైసీపీ లీడర్స్మము ఖ్యమంత్రి చంద్రబాబు పై చంద్రబాబు ఫై అర్థ రహిత ఆరోపణలు చేయడం నీచమైన చర్య అని వైసీపీ నాయకుల ఆరోపణలు ఖండిస్తున్నట్లు కడప జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పీవీయెస్ వి ప్రసాదరావు ఒక ప్రకటన లో పేర్కొన్నారు. లడ్డు తయారీ లో పాలు లేకుండా తయారీ చేసిన కృతిమ నెయ్యి కెమికల్ పదార్థాలు తో తయారు చేసారని స్పష్టంగా పేర్కొన్నా సిగ్గు పడకుండా ఎదురు దాడి చేయడం దారుణం అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విషయం లో క్షమించారాని తప్పు చేసిన అప్పటిపాలక మండలి సభ్యులు సిగ్గు తో తలవంచు కోవాలన్నారు. చైర్మన్ పి ఏ. బ్యాంక్ అకౌంట్ లో కోట్ల రూపాయలు జమ అయినట్లు సిట్ స్పష్టంగా పేర్కొందీ అని అన్నారు. కెమికల్ తో తయారు చేసిన. నెయ్యి లో ఏమైనా ఉండ వచ్చువ ని. ల్యాబ్ నిపుణులు పేర్కొన్న దానిని పట్టించు కోక పోవడం దారుణం అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి పార్టీ అధ్యక్షులు అయిన చంద్రబాబు ను అంబటి రాంబాబు బూతులు తో విమర్శించడం క్షమించరాని విషయం అని అంబటిఫై కేసు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు.