వందే భారత్ సహా 11 కొత్త ట్రైన్లు.. ఎన్నికలున్న రాష్ట్రాలకే.

భారత్ న్యూస్ ఢిల్లీ…..వందే భారత్ సహా 11 కొత్త ట్రైన్లు.. ఎన్నికలున్న రాష్ట్రాలకే.

కేంద్ర ప్రభుత్వం త్వరలో 11 కొత్త ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టబోతుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకే కేటాయించడం విశేషం.ఈ వేసవిలో ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.

కొత్తగా రానున్న వాటిలో ఎనిమిది అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఒక వందేభారత్ స్లీపర్ రైలు ఉన్నాయి.