భారత్ న్యూస్ డిజిటల్: కడప.: పీపీపీ విధానం పై రాజకీయ విష ప్రచారం .
రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న పీపీపీ విధానం పై కేవలం రాజకీయ పార్టీ లు విష ప్రచారం చేయడం తప్ప అందులో వాస్తవం లేదని ప్రస్తుత పరిస్థితి లో పీపీపీ విధానం సరైనది అని కడప జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పీవీయెస్ వి ప్రసాదరావు ఒక ప్రకటన లో తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాని ఆశించిన స్థాయిలో లేదనేది వా స్తావం అని ప్రస్తుత పరిస్థితి లో అభివృద్ధి కార్యక్రమం జరగాలి అంటే ఏండ్లు పడతాయని అన్నారు. ఏ ఏటి కాయేడు బడ్జెట్ అంచనాలు పెరుగుతాయని ఇది అందరికి తెలిసిన విషయం అన్నారు. ప్రజల సమస్య లపై మాట్లాడవలసిన నాయకులు వాటిని విస్మరించి అభివృద్ధి కి తీసుకున్న నిర్ణయాలు ను విమర్శిస్తూ ప్రకటన లు చేయడం సరికాదని అన్నారు. రెండు సంవత్సరాలలో మెడికల్ కళాశాలలు వస్తే పేద విద్యార్థుల కు మెడికల్ విద్య అందుబాటులో కి వస్తుంది కదా అని ప్రశ్నించారు. పేద విద్యార్థులు మధ్య తరగతి వారు మెడిసిన్ చదవాలంటే త్వరిత గతిన కళాశాలలు అందుబాటులో కి రావలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అభివృద్ధి కి సహకరించాలి తప్ప రాజకీయ పార్టీ లు అడ్డుగా నిలిస్తే ప్రజలు క్షమించ రని అన్నారు. కోర్టు లు కూడా ఈ దేశం అభివృద్ధి జరగాలి అంటే పీపీపీ విధానం తప్పదని అంటుంటే మీరు వక్ర బుద్ది తో ఆలోచన చేస్తే ప్రజలు గమనించగలరు అని రాజకీయ పార్టీ లు హుందా గా అభివృద్ధి కి మద్దతు. ఇవ్వాలని ఎన్నికల సమయం లో రాజకీయ లు చేయాలి గాని ప్రతి ఒక్కటి రాజకీయం చేయడం మంచిది కాదని అన్నారు
