ఈ నెల సదరం ధ్రువీకరణ పత్రాలకు స్లాట్ బుకింగ్-డైరెక్టర్ అఫ్ సెకండరీ హెల్త్ చక్రదర్ IAS

భారత్ న్యూస్ గుంటూరు.ఈ నెల సదరం ధ్రువీకరణ పత్రాలకు స్లాట్ బుకింగ్-డైరెక్టర్ అఫ్ సెకండరీ హెల్త్ చక్రదర్ IAS

రాష్టం లో విభిన్న ప్రతిభావంతులకు వైకల్య నిర్దారణకు ఈనెల 14వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ అఫ్ సెకండరీ హెల్త్ చక్రదర్ IAS ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025 రెండు నెలలకుగాను సదరం స్లాట్ బుకింగ్ నిమిత్తం తమ దగ్గరలోని గ్రామ/వార్డ్ సచివాలయంలో సదరం స్లాట్ లు బుక్ చేసుకోవచ్చన్నారు.

రాష్టం లోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలొ మంగళవారం శారీరక, మానసిక, బధిరులు ,దృష్టి వైకల్యం ఉన్నవారికి

ఎరియా హాస్పిటల్ లో శారీరక, దృష్టి వైకల్యం కలిగిన వారికి,

సి.హెచ్.సి లో సోమవారం శారీరక వైకల్యం ఉన్నవారికి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రదర్ ఐఏఎస్ తెలియజేసారు. దయచేసి ఈ వార్తను అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురించగలరని మనవి చేస్తున్నాము.