భారత్ న్యూస్ ఖమ్మం…ఈ నెల 12 నుంచి అంగన్వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
తెలంగాణ :
తెలంగాణలోని అంగన్వాడీ సెంటర్లలో జూన్ 12 నుంచి బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం కానుంది.
ఆదిలాబాద్, భద్రాద్రి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా మొదలయ్యే ఈ పథకంలో పిల్లలకు ప్రతిరోజూ ఉప్మా లేదా కిచిడితో పాటు పాలు అందించనున్నారు.
రాష్ట్రంలో పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం తీవ్రమైన ఎండల కారణంగా అంగన్వాడీల సెలవులను జూన్ 10 లేదా 12 వరకు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది.

సెలవులు పొడిగిస్తే, బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది.