భారత్ న్యూస్ అనంతపురం .. …Ammiraju Udaya Shankar.sharma News Editor…పెన్నా నదిలో బయటపడిన అమ్మవారి విగ్రహం
నెల్లూరు జిల్లాలో అరుదైన ఘటన వెలుగుచూసింది. జొన్నవాడ కామాక్షితాయి టెంపుల్ సమీపంలోని పెన్నా నదిలో అమ్మవారి విగ్రహం బయటపడింది. సరిగ్గా కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే నదిలో అమ్మవారి విగ్రహం బయటపడటంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు.

స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి.. శక్తి స్వరూపినిగా ఉన్న అమ్మవారి రూపాన్ని చూసి పూజలు నిర్వహిస్తున్నారు. విగ్రహాన్ని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి విగ్రహం ఎక్కడి నుంచైనా కొట్టుకువచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది….