రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి- భద్రతలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలుపై ఈ రోజు మాట్లాడుతా:

భారత్ న్యూస్ విశాఖపట్నం..రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి- భద్రతలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలుపై ఈ రోజు మాట్లాడుతా:

Ammiraju Udaya Shankar.sharma News Editor…రెండేళ్ల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్‌ పేరు చెప్తే, సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు మేలు జరిగిన కార్యక్రమాల గురించి మాట్లాడుకునేవారు:

కాని, ఇవాళ ఏపీ పేరు చెప్తే రెడ్‌బుక్‌ రాజ్యాంగం, కస్టోడియల్‌ డెత్స్‌, తర్వాత శవాలను మాయం చేయడం మొదలు, పాలన అంటే మోసాలు, అబద్ధాలు, ప్రజలకు వెన్నుపోట్లు అని చెప్పుకుంటున్న పరిస్థితి.

Rule of law స్థానంలో Rule of Fear తీసుకు వచ్చారు.

పోలీస్‌స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం పూర్తిగా పోయి, ప్రజలు భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు.

ఇలాంటి పరిస్థితులు యాథృచ్ఛికంగా వచ్చినవి కావు.

తాను చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపాలనను ఎవ్వరూ ప్రశ్నించకూడదని, ఎవ్వరూ నిలదీయకూడదని, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, దాన్ని ఒక రాజకీయ ఆయుధంగా చంద్రబాబు మార్చుకున్నారు.

అరాచక రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని ప్రతిపక్ష పార్టీపైన, సోషల్‌మీడియా యాక్టవిస్టులపైనా, జర్నలిస్టులపైనా అందరిపైనా ప్రయోగించాడు.

ఇవాళ మనం చూస్తున్న ఈ దుర్మార్గాలన్నీ కూడా దాని పర్యవసానాలే.

మనం మనుషులమేనని మరిచిపోయి, ఒక మనిషిని మనం ఏం చేసినా అడిగేవాడు ఉండడనే ధైర్యం అసలు ఎక్కడ నుంచి వచ్చింది? ఇది ప్రభుత్వం తప్పుకాదా?

విజయవాడలో సాయికృష్ణ కేసు తీసుకున్నా, పోలీసుల వేధింపులకు బలైపోయిన క్రాంతికుమార్‌ కేసు తీసుకున్నా, కర్నూలు జిల్లాలో లాకప్‌డెత్‌కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు తీసుకున్నా, తెనాలిలో తిరుపతమ్మ కేసు చూసినా, శ్రీకాకుళం జిల్లా సంతకవిటికి చెందిన కళావతి కేసు తీసుకున్నా రాష్ట్రంలో నెలకొన్న భయాన వాతావరణానికి, చంద్రబాబు నడుపుతున్న జంగిల్‌రాజ్‌కు ఇవన్నీకూడా అద్దంపడతాయి.

కస్టడీలోకి తీసుకున్న ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి, చివరకు శవాన్ని కూడా మాయం చేస్తే, ఆ శవంకూడా ఎక్కడ ఉందో, కనీసం DNA ఆనవాళ్లుకూడా తెలియకుండా దహనంచేశారో, ఇంకా ఏంచేశారో తెలియని పరిస్థితుల్లో, కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ, పాశవిక ఘటన జరిగింది:

స్టేట్‌ హెడ్‌ర్వార్టర్స్‌లో ఉన్న పోలీసులే దీనికి ఒడిగట్టారని తెలుసుకుని ప్రజలంతా దిగ్భ్రాంతికి గురయ్యారు:

ఆతర్వాత ఒక్కొక్కటిగా ఇవే తరహా ఘటనలు బయటకు వస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇలాంటివి జరగడమేంటని చంద్రబాబుగారిని నిలదీయకూడదంట?

వీటిగురించి ప్రశ్నిస్తే, నిలదీస్తే క్రిమినల్స్‌కు మద్దతు ఇస్తారా? అంటూ తాను ఎదురుదాడి చేయడమే కాదు, తన మీడియా ద్వారా ఎదురుదాడి చేయించాడు. ఈ టాపిక్‌ను డైవర్ట్‌ చేయడానికి, తన పార్ట్‌నర్‌ను ఒక సైడ్‌ క్యారెక్టర్‌ మాదిరిగా తెరపైకి తీసుకొచ్చి, నానా పొలిటికల్‌ డ్రామాలు చేయిస్తున్నాడు.

చంద్రబాబుగారిని, ఆయనకు మద్దతు ఇస్తున్న పార్టనర్‌ని సూటిగా ప్రశ్నిస్తున్నా? ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం లేదని, కోర్టులతో తమకు పని లేదని, తమకు ఏది అనిపిస్తే అది చేసేస్తామని, తమ చేతిలో ఉన్న కొంతమంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని, కేసులు పెడతాం, చచ్చేదాకా కొడతాం, చంపేస్తాం, బూడిద చేస్తాం, ఆ బూడిద కూడా ఇవ్వమని అధికారిక ప్రకటన చేయగలరా? మీరు మాట్లాడుతున్న మాటలకు అర్థం ఇదే కదా?

సాయికృష్ణని మొదట రౌడీషీటర్‌ అన్నారు. రౌడీషీటర్‌ను వెనకేసుకు వస్తారా? అని ఎదురుదాడి చేశారు. మళ్లీ వెంటనే యూ టర్న్‌.

జనం ఛీ కొడుతున్నారని తెలుసుకుని సాయికృష్ణ కుటుంబాన్ని, ఏకంగా సెక్రటేరియట్‌కు, తన వద్దకు పిలిపించుకున్నారు? మీ నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడితే ఎలా?

ఆ కుటుంబానికి చంద్రబాబు న్యాయం చేస్తానంటే, ఏం న్యాయం చేస్తున్నాడో చెప్పాలికదా?

ఏకంగా 46 రోజులపాటు ఇది బయటకు రాకుండా తొక్కిపెట్టిన ఈ కేసుపై యావత్‌ దేశం దిగ్భ్రాంతికి గురైతే, అసలు ఏం జరిగిందో, చట్టప్రకారం ఎంతమంది మీద, ఎంతమంది పెద్దలమీద, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందా? లేదా?

ఇంత జరిగినా చంద్రబాబుగారిలో నిజాయితీగాని, చిత్తశుద్ధికాని ఏకోశానా లేదు.

సాయికృష్ణ కేసు రిమాండ్‌ రిపోర్టు చూసినా, వీళ్లు చేస్తున్న దర్యాప్తు తీరును చూసినా, కేసును వీక్‌చేసి ఎలా నడుపుతున్నారో, పైవాళ్లను ఎలా కాపాడుతున్నారో చాలా స్పష్టంగా బయటపడుతోంది.

సాయికృష్ణని మార్కాపురం నుంచి తీసుకు వచ్చింది టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అని రిమాండ్‌ రిపోర్టులో చెప్పారు.

వాళ్లు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు అప్పగించిన తర్వాత అకనాలెడ్జ్‌మెంట్‌ కూడా తీసుకున్నారని చెప్పారు.

మరి టాస్క్‌ఫోర్స్‌ పనిచేసేది పోలీస్‌ కమిషనర్‌ కింద. మరి పోలీసు కమిషనర్‌ను ఎందుకు విచారించరు?