ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రతీ గడపకూ సంక్షేమ ఫలాలు

భారత్ న్యూస్ రాజమండ్రి….ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రతీ గడపకూ సంక్షేమ ఫలాలు

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అవనిగడ్డ 2వ వార్డు బీసీ కాలనీలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రతీ గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ఆగష్టు 15 వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించనుందని, ఇప్పటికే తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సాయం చేసిందని పిల్లలు చదువుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,కర్రా సుధాకర్, బండే రాఘవ,పర్చూరి దుర్గాప్రసాద్, బండే కనకదుర్గ, ఘంటసాల రాజ మోహన రావు, విశ్వనాథపల్లి పాప, బచ్చు హనుమాన్, గుంటూరు వినయ్,నాగిడి రాంబాబు, మైల హరిబాబు,షేక్ బాబావలి, గరికిపాటి కృష్ణారావు,జట్టవత్తు శ్రీను, కొండవీటి గోవిందు, గోశాల బాలకోటయ్య, కమ్మిలి సుబ్రమణ్యం,సైకం శ్రీనివాసరావు, నాగిడి గోవిందరాజులు,కొక్కిలిగడ్డ రాము,సైకం నరసయ్య, చెన్ను శివాజీ, కొక్కిలిగడ్డ నాగరాజు, ఉల్లంగుంట వెంకట్రావు, కొల్లూరి ఇమ్మనియేలు, చెన్నగిరి అయ్యప్ప,విశ్వనాథపల్లి నాగ మల్లీశ్వరి, మైల భారతి, అమ్మాజి,రాజనాల ఆదిలక్ష్మి,ఆకుల సీతామహాలక్ష్మి, ఆంగోతు శాంతి తదితరులు పాల్గొన్నారు