భారత్ న్యూస్ శ్రీకాకుళం…..ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుచేసి , సుపరిపాలన అందించటమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం …
అవనిగడ్డ 2వ వార్డు ఎస్టీ కాలనీలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ,స్థానికంగా ఉన్న సమస్యలను రికార్డు చేస్తూ, ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.
కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వార్డులో ఎవరికైనా రాకపోతే, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని హామీ ఇచ్చారు. అలాగే ఇంకా మరెన్నో పథకాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా అమలుపరుస్తామని, కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా సంతోషం గా ఉన్నారని తెలిపారు.
జగన్ రెడ్డి హయాంలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినా, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టినా కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి, ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ప్రతి నెలా పెన్షన్లు, ప్రతి నెల రేషన్, ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు, దీపం పథకం లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు,ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ, ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని కోరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అమరావతి రాజధానిని నిర్మించాలన్న, పోలవరాన్ని పూర్తి చేయాలన్న కూటమి ప్రభుత్వం ఇంకా 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలన్న అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కొల్లూరి వెంకటేశ్వరరావు,కర్రా సుధాకర్, బండే రాఘవ, పర్చూరి దుర్గాప్రసాద్,మండలి రామ్మోహన్ రావు, బచ్చు హనుమాన్,బండే కనకదుర్గ, బచ్చు కృష్ణ కుమారి, మెగావత్తు గోపి, దాసినేని శ్రీనివాసరావు,అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ ,కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, జట్టవత్తు శ్రీను,ఆది బుజ్జి, కమ్మిలి సుబ్రమణ్యం,దాసినేని సాంబయ్య మైల హరిబాబు,ఆకుల సీతామహాలక్ష్మి,బాలమ్మ తదితరులు పాల్గొన్నారు
