భారత్ న్యూస్ అనంతపురం..ఏరువాక పౌర్ణమి….
ఇది రైతులు, వ్యవసాయ పనులను ప్రారంభించే ముందు భూమి పూజ చేసే రోజుగా జరుపుకుంటారు
వేసవిలో మండే ఎండలకు వీడ్కోలు పలుకుతూ తొలకరి తెలుగు వారింట అడుగుపెట్టింది.
తరలివచ్చిన తొలకరి జల్లులతో నేల తల్లి పులకరించే మధుర క్షణాలు ఏరువాక పౌర్ణమి.
ఈ పవిత్రమైన ఏరువాక పౌర్ణమి నాడు రైతులు తమకు పంటను ప్రసాదించే భూమి తల్లిని పూజిస్తారు.
ఎద్దులకు పసుపు, కుంకుమలతో అందంగా అలంకరిస్తారు.
మూపురాలకు నమస్కరించి వృషభ పూజ చేస్తారు.
నాగలికి హల ప్రవాహ పూజను నిర్వహిస్తారు.
ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని, అన్నదాతలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.

వర్షాలు సమృద్ధిగా కురవాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను.
భూమికి పూజ చేసి, పొలాల సాగును ఆరంభించండి.
అన్ని పంటలు బాగా పండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ….
రైతులందరికీ “ఏరువాక పౌర్ణమి” శుభాకాంక్షలు! 💐
ఇట్లు
విక్కుర్తి శ్రీనివాసరావు
ప్రముఖ పారిశ్రామికవేత్త,
V.V.R ఫౌండేషన్ ఛైర్మన్,
అవనిగడ్డ.