టీమిండియాపై క్లీన్ స్వీప్ చేసిన ఐర్లాండ్..

భారత్ న్యూస్ రాజమండ్రి…పిల్ల కూనలపై ఓడిపోయిన దిగ్గజ ఇండియా….రెండో టీ20లోనూ అదే ఫలితం… టీమిండియాపై క్లీన్ స్వీప్ చేసిన ఐర్లాండ్..

రెండో టీ20లో భారత్‌పై ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ గెలుపు

రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఐరిష్ జట్టు

భారత్ 16 సిరీస్‌ల విజయాల జైత్రయాత్రకు అడ్డుకట్ట

కీలక ఆటగాళ్లు లేకుండానే అద్భుతం చేసిన ఐర్లాండ్

తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసినా తప్పని ఓటమి

పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు అనూహ్య పరాభవం ఎదురైంది. బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది.

ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలిచి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ ఓటమితో టీమిండియా 16 సిరీస్‌ల విజయాల జైత్రయాత్రకు తెరపడింది…