భారత్ న్యూస్ రాజమండ్రి…ప్రకాశం. జిల్లా :
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
ఆకతాయిల ఆగడాలతో జీటీ ఎక్స్ ప్రెస్ అద్దాలు ధ్వంసం, లోకో పైలెట్ కి గాయాలు..
ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో,ఎర్నాకులం ,నుంచి బిలాస్పూర్ వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలు లోని ఆకతాయిలు, ఎదురు గా వస్తున్న జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజన్ పై వారు ఆహారం,మద్యం బాటిలు విసరటంతో జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజన్ ముందు అద్దం పగిలి లోకో పైలట్ ఆంజనేయులకి గాయాలు..
జీటీ ఎక్స్ ప్రెస్ రాత్రి ఒంటి గంట సమయం లో నిలుపుదల చేసి గాయపడిన లోకో పైలట్ ను ఉలవపాడు ప్రభుత్వ వైద్య శాలకి తరలించి ప్రథమ చికి త్స అనంతరం విజయవాడ రైల్వే వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్న వైనం

ఈ ఘటన పై ఒంగోలు ఆర్పిఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నారు