రాష్ట్రంలో జులై 1 నుండి అమలు కానున్న VB-G RAM Gపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

భారత్ న్యూస్ గుంటూరు…రాష్ట్రంలో జులై 1 నుండి అమలు కానున్న VB-G RAM Gపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీని ప్రకారం పనిదినాలను 100 నుండి 125 రోజులకు పెంచారు. కూలీలకు వారానికోసారి వేతనాలు చెల్లించాలి.

ఒకవేళ 15 రోజుల్లోపు జీతం జమకాకుంటే 0.05% వడ్డీ చెల్లిస్తారు.

అలాగే వ్యవసాయ పనుల సమయంలో కూలీల కొరత లేకుండా, రాష్ట్రాలు 60 రోజుల పాటు ఉపాధి విరామాన్ని ప్రకటించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.