భారత్ న్యూస్ హైదరాబాద్…జూన్ 22 నుంచి హైడ్రా ప్రజావాణి ప్రారంభం
తెలంగాణ :
హైదరాబాద్ వాసులకు అలర్ట్. ఈ నెల 8, 15 తేదీల్లో జరగాల్సిన హైడ్రా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడింది.
పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా మే 11 నుంచి నాలుగు సోమవారాలు ప్రజావాణికి విరామం ఇచ్చారు.
కమిషనర్ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం పరిష్కరించాల్సిన ఫిర్యాదులు ఇంకా ఉన్నందున గడువును మరో రెండు వారాలు పెంచారు.
ఈ నెల 22వ తేదీ నుంచి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది.
